![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -788 లో.. వసుధారని ఎందుకు కాల్ చేసావని మహేంద్ర అడుగుతాడు. వసుధార తడబడుతూ.. రిషి సర్ గురించి ఏమైనా తెలిసిందేమోనని కాల్ చేసానని అనగానే.. మీరు ఇద్దరు రిషిని మోసగాడిలాగా ముద్రవేశారు కదా.. వాడు ఎందుకు వస్తాడని మహేంద్ర కోప్పడుతాడు. ఆ తర్వాత మహేంద్ర ఫోన్ కట్ చేయగానే.. ఏమైంది మహేంద్ర వసుధార ఎందుకు కాల్ చేసిందని జగతి అడుగుతుంది. జగతితో మహేంద్ర మాట్లాడకుండా.. ధరణిని పిలుస్తాడు. ఇన్ని రోజులు కాల్ చెయ్యని వసుధార ఈ రోజు చేసింది.. తనకి రిషి గురించి తెలుసేమోనని అనిపిస్తుంది. అందుకే వసుధార ఎక్కడ ఉందో తెలుసుకొని రిషి గురించి తెలుసుకుంటానని మహేంద్ర అంటాడు.
మరొకవైపు వసుధార ఎదురుపడటం రిషి పదే పదే గుర్తు చేసుకుంటాడు. వసుధార చేసిన మోసాన్ని గుర్తుచేసుకుంటూ.. ఎవరైతే నా లైఫ్ లో చూడొద్దు అనుకున్నానో వాళ్ళే ఎదురుపడ్డారు.. నేను ఆ కాలేజీకి వెళ్ళను ఎందుకంటే రోజు ఎదురుపడితే చూడలేనని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గరికి రిషి వెళ్లి.. నేను రేపటి నుండి కాలేజీకి వెళ్ళనని చెప్తాడు.
ఆ తర్వాత మహేంద్ర తన ఫ్రెండ్ తో మాట్లాడతాడు. వసుధార నాకు కాల్ చేసింది.. ఎలాగైనా వసుధార అడ్రెస్ కనిపెడితే రిషి గురించి తెలుస్తుందని మహేంద్ర చెప్తాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్ సరేనని చెప్తాడు. ఆ తర్వాత వసుధార చైర్మెన్ దగ్గరికి వస్తుంది. రిషి సర్ అడ్రెస్ కావాలని అడుగుతుంది. రిషి సర్ ఇక్కడ ఉన్నాడు అనేలోపు.. రిషి అక్కడికి వస్తాడు. ఇక మీ కాలేజీలో నేను లెక్చరర్ గా చెయ్యట్లేదని వసుధార చెప్తుంది. ఎందుకు ఏమైందని విశ్వానాథ్ అడుగుతాడు. ఏం లేదు సర్ నా పర్సనల్ రీజన్ వల్ల వెళ్లిపోతున్నానని వసుధార చెప్తుంది.
ఆ తర్వాత విశ్వనాథ్ ఇలా వచ్చిన ఫాకల్టీ అంతా వెళ్లిపోతుంటే నేను ఏం చేయాలి.. ఒక లెక్చరర్ ని కాపాడుకోలేకపోతున్నాను.. ఇక కాలేజీ చైర్మన్ గా ఎందుకు? నేను కాలేజీ మూసివేస్తానని విశ్వనాథ్ అనగానే.. మీరు ఏం టెన్షన్ పడకండి ఆ అమ్మాయి వెళ్ళదని విశ్వనాథ్ తో రిషి చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార జాబ్ మానేస్తున్నట్లు లెటర్ ని ప్రిన్సిపల్ కి ఇస్తుంది. అప్పుడే రిషి వచ్చి.. వసుధార ఇచ్చిన లెటర్ ని చింపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |